ఇద్దరు విద్యార్థులు వ్యవసాయ బావిలో పడి గల్లంతైన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి శివారులో చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన వేణు, వరుణ్ తేజ్ ఇద్దరు అన్నదమ్ములు. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్తూ... చిన్నమ్మ ఇంటి దగ్గర ఆగారు. గురువారం మధ్యాహ్నం మరో ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. అక్కడ పని చేస్తున్న రైతులు పిల్లల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గద్దించారు. మరో బావి దగ్గరికి వెళ్లి ఈత కొట్టారు. ఈ ఇద్దరు గల్లంతు కాగా... మిగతా ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చుట్టుపక్కల ఉన్న రైతులు రక్షించే ప్రయత్నం చేసినా దొరకలేదు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు గాలిస్తున్నారు. కుటుంబసభ్యుల రోదనలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి.
ఈతకు వెళ్లి బావిలో అన్నదమ్ముళ్ల గల్లంతు - బావిలో అన్నదమ్ముళ్ల గల్లంతు
ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు బాలురు బావి మునిగిపోయారు. దసరా సెలవుల కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన అన్నదమ్ములు మహబూబాబాద్ కురవి గ్రామంలో గల్లంతయ్యారు.
ఈతకు వెళ్లి బావిలో అన్నదమ్ముళ్ల గల్లంతు