ఆర్టీసీ కార్మికల 43వ రోజు సమ్మెలో భాగంగా మహబూబాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలు బైఠాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాను విరమించకపోవడంవల్ల 60మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహబూబాబాద్‌లో 60 మంది ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ - tsrtc employees arrest at mahabubabad latest news
మహబూబాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగిన 60 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
మహబూబాబాద్‌లో 60 మంది ఆర్టీసీ కార్మికుల అరెస్ట్
ఆర్టీసీ కోసం కార్మికులు ప్రాణత్యాగం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తిస్తోందంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి కార్మిక సంఘ నేతలతో చర్చలు జరపాలని కోరారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?