మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఇవాళ జరిగింది. అన్ని చోట్లా తెరాస మద్దతుదారులే పదవులు చేపట్టారు.
నరసింహులపేట పీఏసీఎస్ ఛైర్మన్‌గా సంపేట రాము, వైస్‌ఛైర్మన్‌గా సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. మరిపెడ సహకార సంఘానికి ఛైర్మన్‌గా యాదగిరిరెడ్డి, వైస్‌ఛైర్మన్‌గా మహేశ్ ఎన్నికయ్యారు.
కురవి వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా గోవర్ధన్‌రెడ్డి, వీరన్న ఎన్నికయ్యారు. కాంపల్లి సొసైటీ ఛైర్మన్, వైస్ఛైర్మన్లుగా శ్రీదేవి, శ్రీను.. గుండ్రాతిమడుగు ఛైర్మన్‌గా వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా దీపక్ ఎన్నికయ్యారు.
డోర్నకల్ పీఏసీఎస్ ఛైర్మన్‌గా భిక్షం రెడ్డి, వైస్‌ఛైర్మన్‌గా వెంకన్న ఎన్నికయ్యారు. మన్నెగూడెం సహకార సంఘం ఛైర్మన్‌గా సీతారాం రెడ్డి, వైస్‌ఛైర్మన్‌గా మన్మధరావు ఎన్నికయ్యారు. వీరితో ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన వారిని స్థానిక ప్రజాప్రతినిధులు సన్మానించారు.
ఏడు చోట్లా తెరాస మద్దతుదారులకే పదవులు ఇవీచూడండి :హాలియా సహకార పోలింగ్‌లో రైతుపై చేయిచేసుకున్న ఎస్సై