పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందడాన్ని హర్షిస్తూ తెరాస శ్రేణులు సంబురాలు జరిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, కుమ్మరికుంట్ల గ్రామాల్లో రంగులు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
'అభివృద్ధి పథకాలే గెలిపించాయి' - trs leaders celebrations
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపుని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. పల్లా విజయంతో మహబూబాబాద్ జిల్లాలో ఆనందంలో మునిగిపోయారు.
తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: తెరాస శ్రేణులు
అనంతరం బాణా సంచా కాల్చి తెరాసకు మద్దతుగా నినాదాలు చేస్తూ.. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అమలు పరుస్తోన్న వివిధ రకాల అభివృద్ధి పథకాలను చూసే పట్టభద్రులు తెరాసకు రెండో సారి పట్టం కట్టారన్నారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు.
ఇదీ చదవండి:ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు ఈసీ అనుమతి