దిశ హత్య ఘటన యావత్ భారతాన్ని కలచివేసిందని తెరాస ఎంపీ మాలోత్ కవిత తెలిపారు. దిశ హత్య ఘటన నిర్భయను గుర్తు చేసిందని పేర్కొన్నారు. దిశ హత్యాచార ఘటనపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. మహిళల రక్షణపై సభలో చర్చ జరగాలని అన్నారు. పార్టీలకు అతీతంగా మహిళల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని చెప్పారు. అత్యాచారాలకు పాల్పడిన వారికి వెంటనే ఉరిశిక్ష వేయాలని కోరారు.
అలాంటి వాళ్లకు ఉరే సరి... ఇప్పుడే చట్టం చేద్దాం: కవిత - ప్రియాంక రెడ్డి అత్యాచారం
దిశ హత్య ఘటన అత్యంత దారుణమని... అలాంటి వాళ్లకు ఉరి శిక్ష వేయాలని తెరాస ఎంపీ మాలోత్ కవిత అన్నారు. పార్టీలకు అతీతంగా మహిళల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
maloth kavith