తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS MP KAVITHA: తెరాస ఎంపీ మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట - telangana varthalu

తెరాస ఎంపీ మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట లభించింది.ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా. విచారణ చేపట్టిన ఉన్నత తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

TRS MP KAVITHA: తెరాస ఎంపీ మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట
TRS MP KAVITHA: తెరాస ఎంపీ మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట

By

Published : Jul 30, 2021, 3:43 PM IST

మహబూబాబాద్‌ తెరాస ఎంపీ మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట లభించింది. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపీ కవితపై 2019లో బూర్గంపహాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అసలేం జరిగింది..

పార్లమెంటు ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా మాలోత్ కవిత పోటీ చేశారు. ప్రచార సమయంలో మాలోత్ కవిత అనుచరుడు షౌకత్ అలీ వద్ద 9 వేల 400 రూపాయలు స్వాధీనం చేసుకున్న ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాలోత్ కవిత, షౌకత్ అలీపై 2019లో ఐపీసీ 188, 171 బీ ప్రకారం కేసు నమోదు చేసిన బూర్గంపహాడ్ పోలీసులు... హైదరాబాద్​లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఐపీసీ 171 బీ కింద మాలోత్ కవిత, షౌకత్ అలీపై నేరాభియోగాలు రుజువైనట్లు ప్రకటించింది. తాజాగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి: MP Maloth Kavitha: ఎంపీ కవితకు 6 నెలల జైలు శిక్ష, 10 వేలు జరిమానా

ABOUT THE AUTHOR

...view details