రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడలో తెరాస కార్యకర్తలు, నాయకులు సంబురాలు చేసుకున్నారు. స్థానిక గాంధీ కూడలిలో ప్రభుత్వానికి అనుకూలంగా నినదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం - ఎమ్మెల్యే రెడ్యా నాయక్ వార్తలు
నూతన రెవెన్యూ చట్టంతో రైతులకు ప్రయోజనం చేకూరనుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ మరిపెడలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
కొత్త చట్టంతో రైతులకు మేలు జరగుతుందని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తెలిపారు. అనంతరం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికలపై డోర్నకల్ నియోజకవర్గ తెరాస ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో సమీక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్లానింగ్, విజనింగ్, డిజైనింగ్‌పై దృష్టి పెట్టండి: కేటీఆర్