హుజూర్నగర్ ఉపఎన్నికల ఫలితాలలో తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపుపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నెహ్రూ సెంటర్లలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి పెట్టి సంబురాలు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ వర్షం కారణంగా రద్దయితే ఓటమి భయంతోనే రాలేదని ప్రచారం చేసినా... సైదిరెడ్డి గెలుపు ఖాయమైందన్నారు. ఈ గెలుపు విపక్ష పార్టీలకు గుణపాఠమని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు.
ప్రతిపక్షాలకు ఈ గెలుపు ఓ గుణపాఠం: శంకర్‌నాయక్ - trs news
హుజూర్‌నగర్‌లో తెరాస గెలుపుపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.
ప్రతిపక్షాలకు ఈ గెలుపు ఓ గుణపాఠం: శంకర్‌నాయక్