స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెరాస అధికారంలోకి వచ్చే వరకు రాష్ట్రంలో గిరిజనులకు 50 గురుకుల పాఠశాలలుండేవని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఐదేళ్ల కేసీఆర్ పాలనలో 53 నూతన గురుకులాలు ప్రారంభించామని తెలిపారు.
'కేజీ టూ పీజీ ఉచిత విద్యకు ప్రభుత్వం కృషి చేస్తోంది' - పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కేసీఆర్ మానసపుత్రిక అయిన కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచిత విద్య
తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచిత విద్య
మహబూబాబాద్‌లో గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీలకు 40 ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
గ్రామ సర్పంచ్‌లు ట్రాక్టర్లను తమ సొంత పనులకు ఉపయోగించొద్దని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు.