తెలంగాణ

telangana

ETV Bharat / state

Tribal Student: కిలిమంజారో ఎక్కేస్తా..సాయం చేయండి: గిరిజన విద్యార్థి - గిరిజన విద్యార్థి

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు తనకు ఆర్థికంగా సాయం అందించాలని గిరిజన విద్యార్థి గుగులోత్​ హరీష్​ వేడుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాలోని పర్వతాన్ని అధిరోహించేందుకు హరీష్​ను ఇండియన్ హిమాలయ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఏకో టూరిజం సంస్థ ఎంపిక చేసింది.

TRIBAL STUDENT ASKING HELP TO CLIMB MOUNT KILIMANJARO WHO SELECTED TO CLIMB THE MOUNT
సాయం చేస్తే.. కొండెక్కేస్తా: గిరిజన విద్యార్థి

By

Published : Jun 16, 2021, 12:01 PM IST

మహబూబాబాద్​ జిల్లా కురవి మండలం తాట్యా తండాకు చెందిన గిరిజన విద్యార్థి గుగులోత్ హరీష్ దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికయ్యాడు. హరీశ్​.. గూడూరు మండలం దామరవంచలోని గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గతంలో పలు రాష్ట్రాల్లోని పర్వతాలను అధిరోహించి పతకాలు, ప్రశంసాపత్రాలు సాధించాడు.

ఈ ఏడాది ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు దక్షిణ ఆఫ్రికాలోని 5,895 అడుగుల ఎత్తైన కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికయ్యాడు. ఇండియన్ హిమాలయ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఏకో టూరిజం సంస్థ తనను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాకు వెళ్లే ఆర్థిక స్థోమత తనకు లేదని, దాతలు సాయం అందించాలని హరీష్ విజ్ఞప్తి చేస్తున్నాడు.

ఇదీ చూడండి:నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!

ABOUT THE AUTHOR

...view details