మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. భద్రాచలం నుంచి బల్లార్షా వెళ్లే సింగరేణి ప్యాసింజర్లో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించలేదని నిరసిస్తూ ధర్నా చేశారు. వసతుల్లేని రైలు వద్దంటూ పట్టాలపై బైఠాయించి నినాదాలు చేశారు. కనీస సౌకర్యాలు లేకపోతే ఎలా ప్రయాణిస్తామంటూ అధికారులపై ధ్వజమెత్తారు. దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. అధికారుల హామీతో వారు ఆందోళన విరమించాక రైలు తిరిగి ప్రారంభమైంది.
రైలు ప్రయాణీకుల ఆందోళన.. పట్టాలపై బైఠాయింపు - mahabubabad
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సింగరేణి ప్యాసింజర్లో మూత్రశాల వంటి కనీస వసతులు లేవని ఆరోపిస్తూ రైలు పట్టాలపై బైఠాయించి నినాదాలు చేశారు.
రైలు ప్రయాణీకుల ఆందోళన