ప్రమాదాలు క్రైమ్ రేటు తగ్గాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు ఎంతో అవసరమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏడున్నర లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ లతో కలిసి ప్రారంభించారు.
పోలీసులు ఎంత మంది ఉన్నా మనలో క్రమశిక్షణ లేకపోతే లక్ష్యం నెరవేరదని మంత్రి స్పష్టం చేశారు. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు అయ్యాయని తెలిపారు. జిల్లాకి వచ్చే ప్రజలంతా ట్రాఫిక్ సిగ్నల్స్ చూసుకొని తమ వాహనాలను నడపాలని, ఇష్టా రీతిలో వాహనాలు నడిపితే ఫైన్లు పడుతాయని హెచ్చరించారు.