మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం "ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాలు" కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య పాల్గొన్నారు. తమ ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ని తానే స్వయంగా చల్లారు.
'సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోండి' - sanitation program
"ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాలు" కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య పాల్గొన్నారు. తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేసి... బ్లీచింగ్ పౌడర్ చల్లారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
!['సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోండి' torrur municipal chairmen participated in sanitation program](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7993353-563-7993353-1594538596549.jpg)
'సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోండి'
ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, పూల కుండీలు, పాత టైర్లు, గుంటల్లో ఉన్న నీటిని తొలగించుకోవాలని ఛైర్మన్ సూచించారు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పరిసరాలు పరిశుభ్రత పాటించాలని రామచంద్రయ్య సూచించారు.