ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకోవాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సివిల్ జడ్జి సరితఅన్నారు. తొర్రూర్ మున్సిపాలిటీలో మండల న్యాయ సేవా సంస్థ, తొర్రూర్ బార్ అసోసియేషన్ సంయుక్తంగా 87 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
తొర్రూరులో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ - torrur civil judge distributed rice and vegetables to poor
లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఉపవాసం ఉండే పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో నిరుపేదలకు సివిల్ జడ్జి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
![తొర్రూరులో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ torrur-civil-judge-distributed-rice-and-vegetables-to-poor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6722270-thumbnail-3x2-mbbd.jpg)
తొర్రూరులో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ
కార్యక్రమంలో తొర్రూర్ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. దేశంలోనే లాక్డౌన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పగడ్బందీగా అమలు చేస్తున్నారని... ప్రజలెవరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకురావొద్దని సూచించారు.
ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక