MAOIST LEADER: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి! - telangana varthalu

15:01 June 22
మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి!
మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో హరిభూషణ్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. హరిభూషణ్ మృతిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయలేదు. సాయంత్రం పోలీసులు ప్రకటన చేసే అవకాశం ఉంది.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మడగూడెెం గ్రామానికి చెందిన హరిభూషణ్ 1995లో పీపుల్స్‌వార్ గెరిల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ కమిటీ కార్యదర్శిగా కీలకపాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ-చత్తీసగఢ్ సరిహద్దుల్లో జరిగిన అనేక ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించాడు. ఆయన కరోనాతో పోరాడి మృతి చెందినట్లు సమాచారం. ఏజెన్సీలో మరికొందరు మావోలు కరోనా బారినపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినోద్, రాజేశ్, ఇడుమా కూడా కరోనా బారినపడినట్లు పోలీసులు భావిస్తున్నారు.