రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పుడు లెక్కలతో యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో ఆయన పర్యటించారు. ఆరేళ్ల క్రితం లక్షా 7వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారని... ఇప్పటి వరకూ భర్తీ చేసింది... 66వేలు మాత్రమేనని చెప్పారు.
కాంట్రాక్టు ఉద్యోగులతో కాలం వెళ్లదీస్తోంది: కోదండరాం - telangana varthalu
తెరాస ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులతో కాలం వెళ్లదీస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై తప్పుడు లెక్కలతో యువతను మభ్యపెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.
కాంట్రాక్టు ఉద్యోగులతో కాలం వెళ్లదీస్తోంది: కోదండరాం
ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిలిపివేసిన సర్కార్... కాంట్రాక్టు ఉద్యోగులతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు సిద్ధమన్న కేటీఆర్... తర్వాత మాటమార్చారన్నారు. ఉద్యోగాల భర్తీపై చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమేనని కోదండరాం సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: మంత్రులతో సీఎం భేటీ... ఎమ్మెల్సీ, సాగర్ ఉపఎన్నికపై చర్చ!