తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ విద్యాసంస్థలపై సర్కారు చిన్నచూపు: కోదండరాం - మహబూబాబాద్ జిల్లా వార్తలు

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో జరిగిన టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో తెజస అధ్యక్షుడు, వరంగల్- నల్గొండ -ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆచార్య కోదండరాం పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.

tjs kodandaram fire on trs government
tjs kodandaram fire on trs government

By

Published : Jan 10, 2021, 9:59 PM IST

ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల రాష్ట్ర సర్కార్​ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెజస అధ్యక్షుడు, వరంగల్- నల్గొండ -ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆచార్య కోదండరాం ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో జరిగిన టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లోని ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయడం లేదని కోదండరాం మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల పరిస్థితి దయనీయంగా మారిందని దుయ్యబట్టారు. వైస్​ఛాన్స్​లర్ల పోస్టులు పదిహేను నెలల తరబడి ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రైవేటును ప్రోత్సహించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.

ఇదీ చూడండి: ఆధునిక పద్ధతిలో పంటల సాగు... లాభాలు బహుబాగు

ABOUT THE AUTHOR

...view details