తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్ జిల్లాలో నల్లబెల్లం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు - Palm Jaggery NEws

అక్రమంగా విక్రయిస్తున్న నల్లబెల్లంను మహబూబాబాద్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిపెడ మండలం కొత్త తండా సమీపంలో డీసీఎం వాహనంలో తీసుకువచ్చి.. విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఈకేసులో ముగ్గురిని అరెస్టు చేశామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Three arrested in Mahabubabad district Palm Jaggery Seazed
మహబూబాబాద్ జిల్లాలో నల్లబెల్లం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

By

Published : May 20, 2020, 10:30 AM IST

మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా విక్రయిస్తున్న నల్లబెల్లంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిపెడ మండలం కొత్త తండా సమీపంలో డీసీఎం వాహనంలో నల్ల బెల్లం తీసుకువచ్చి.. విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

డీసీఎం వాహనంలోని 45 క్వింటాళ్ల నల్ల బెల్లం, 150 కిలోల పట్టిక, 40 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. డీసీఎం వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ వెల్లడించారు. ఈకేసులో రమేష్, రేఖ నర్సయ్య, డీసీఎం డ్రైవర్ జహంగీర్ లను అరెస్టు చేశామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

ABOUT THE AUTHOR

...view details