మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో కరోనా అవగాహన ఫ్లెక్సీలు, డోర్ పోస్టర్లను ఆర్డీఓ రమేష్ ఆవిష్కరించారు. ధర్మశ్రీ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ధరావత్ విమల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు, డోర్ పోస్టర్లపై "మా ఇంటికి రాకండి - మీ ఇంటికి రానివ్వకండి" అనే నినాదాన్ని ముద్రించారు.
Corona awareness: ఫ్లెక్సీలు, డోర్ పోస్టర్లతో కరోనాపై అవగాహన - తొర్రూరులో కరోనాపై అవగాహన కల్పించే డోర్ పోస్టర్ల పంపిణీ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో "మా ఇంటికి రాకండి - మీ ఇంటికి రానివ్వకండి" అంటూ ఫ్లెక్సీలు, డోర్ పోస్టర్లపై ముద్రించి.. వాటిని ప్రజలకు అందజేశారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు ఇలా చేశామని ఆర్డీఓ తెలిపారు.

corona
స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సభ్యులు కరోనా కట్టడికి అన్ని విధాల సహకరించారని ఆర్డీఓ రమేష్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను గ్రామాల్లో ఎంత సమర్థంగా అమలు చేయగలిగితే అంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని రమేష్ కోరారు.
ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ