గుడినే కాదు... గుడిలో ఉన్న లింగాన్ని కూడా దొంగిలించిన చందంగా ఉంది దొంగల తీరు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఈనెల 9న ఓ వ్యక్తి రాత్రి రైస్ మిల్లులో దొంగతనానికి వెళ్లాడు. అక్కడ క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.15 వేల నగదు తీసుకున్నాడు. అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించి దొరకకూడదనే అభిప్రాయంతో వాటిని కూడా దొంగిలించాడు.
డబ్బలు, సీసీ కెమెరాలు కొట్టేశాడు.. కానీ దొరికిపోయాడు..
చిన్న చిన్న చోరీలు చేసే ఓ వ్యక్తి ఓ రైస్ మిల్లులో దొంగతనానికి వెళ్లాడు.. అక్కడ క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.15 వేలు తీసుకున్నాడు.. తర్వాత తానూ దొరకకూడదని సీసీ కెమెరాలను సైతం కొట్టేశాడు. చివరికి దొరికిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు అంబేడ్కర్ కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పాడు. గతంలో కూడా వ్యవసాయ మార్కెట్లో చిన్న చిన్న చోరీలకు పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రూ. 15 వేల నగదు, 30 వేల విలువ చేసే సీసీ కెమరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దొంగతనాలు చేసిన రవిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి :మండలిలో బడ్జెట్‌పై చర్చ పూర్తి.. రేపు మంత్రి సమాధానం