మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడికి చెందిన యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేని వధువు ఏకంగా పెళ్లి మండపం నుంచే పోలీసులకు ఫోన్ చేసింది. తాను ఓ యువకుడిని ప్రేమించానని, తన ఇష్టంతో ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ పెళ్లిని ఎలాగైనా నిలిపివేయాలని వేడుకుంది.
వధువు వద్దంది.. పెళ్లికొచ్చిన అమ్మాయే పెళ్లికూతురైంది - marriage news in mahabubabad
పెళ్లి మండపం కోలాహలంగా ఉంది. మంగళవాద్యాలు.. బంధుమిత్రులతో అంతా సందడి వాతావరణం నెలకొంది. వధూవరులు పెళ్లిపీటలపై కూర్చొని ఉండగా, పురోహితుడు వేదమంత్రాలు చదువుతున్నాడు. మరికొద్ది క్షణాల్లో తాళికట్టే శుభగడియ సమీపిస్తుందనగా, పెళ్లి మండపంలోకి పోలీసులు వచ్చారు. పెళ్లి ఆపాలని సూచించడంతో అందరూ అవాక్కయ్యారు.
పోలీసులకి ఫోన్ చేసి.. పీటలపై పెళ్లి ఆపేసింది
స్పందించిన మరిపెడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాగర్, ఎస్సై అశోక్ పెళ్లి మండపం వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా యువతి ససేమిరా అనడంతో వివాహం నిలిచిపోయింది. అనంతరం యువతిని పోలీసులు కౌన్సెలింగ్ నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు. దీన్ని అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు వివాహానికి హాజరైన సమీప బంధువుల అమ్మాయితో అదే మండపంలో పెళ్లి చేయడం విశేషం.
ఇదీ చూడండి: ఆందోళన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండండి: కిషన్ రెడ్డి
Last Updated : Dec 25, 2020, 7:30 AM IST