అవిభక్త కవలలు వీణా-వాణి పదోతరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ వెంగళ్‌రావునగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు హాల్‌టికెట్లు పొందారు. మధు రానగర్‌లోని ప్రతిభా పాఠశాల కేంద్రంలో పరీక్షలకు హాజరయ్యారు.
నా బిడ్డలకు అదనపు సమయం కల్పించండి: వీణావాణి తండ్రి
అవిభక్త కవలలు వీణా-వాణీలు పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్నారు. వారిరువురు పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అధికారులు వేర్వేరుగా హాల్‌టికెట్లు జారీ చేశారు. తమ పిల్లలకు అదనపు సమయం ఇవ్వాలని వారి తండ్రి కోరుతున్నారు.
పదోతరగతి పరీక్షలు రాస్తున్న వీణా-వాణి
వీణావాణీలు అవిభక్త కవలలు అవ్వడం వల్ల వీరిలో ఒకరు కిందకు చూస్తే మరొకరు పైకి చూసే అవకాశం ఉంది. అందువల్ల వీరు పరీక్షలు రాసేందుకు అదనపు సమయం కేటాయించాలని బాలికల తండ్రి మురళి కోరుతున్నారు. తమ పిల్లలు పెరిగి పెద్దవారయ్యారని, పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.