మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణ-శ్రావణి దంపతుల కుమారుడు ఆడుకున్న తర్వాత గ్రామ శివారులోని చెరువుకు బహిర్భూమికి వెళ్లాడు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులోకి పడిపోయాడు.
బాలుని మృతితో ఆ కుటుంబంలో విషాదం
ఓ వైపు కరోనా భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.. మరోవైపు పాఠశాలలకు సెలవులు. ఈ నేపథ్యంలో ఓ బాలుడు ఆట తర్వాత చెరువుకు బహిర్భూమికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఇది జరిగింది మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురంలో.
Breaking News
ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగి మృతి చెందాడు. కుమారుని మృతితో వారి కుటుంబ సభ్యులు రోధించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వేసవిలో పిల్లలు ఇళ్లల్లోనే ఉండేలా చూడాలని, బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి :ఆటోకార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ