మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పాల్గొని అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి'
మున్సిపాలిటీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది కృషిచేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల విధులపై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి'
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ, ఏఆర్ డీఎస్పీ శశిధర్‌తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఈ బెలూన్లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు