తెలంగాణ

telangana

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి : రెడ్యా

ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి రైతులు లబ్ధి పొందాలని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ తెలిపారు. నియోజకవర్గంలోని పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

By

Published : Apr 14, 2020, 4:15 PM IST

Published : Apr 14, 2020, 4:15 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డోర్నకల్‌ శాసన సభ్యుడు డీఎస్‌ రెడ్యానాయక్‌ కోరారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం గొల్లచర్ల, బంజర, ఉయ్యాలవాడ, మన్నెగూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు.

రైతులు పండించిన పంటకు మద్ధతు ధర కల్పించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి లబ్ధిపొందాలని సూచించారు.

ఇవీచూడండి:నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500

ABOUT THE AUTHOR

...view details