ప్రజలంతా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య సూచించారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రెండు వేల మట్టి గణపతి విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతుల విక్రయశాలను ప్రారంభించారు. వినాయక చవితి ప్రకృతి సిద్ధమైన పండగ అని, ఈ పండగకు ప్రజలంతా మట్టి గణపతిని పూజించి, దేవుడి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.
మట్టి వినాయకులను పంపిణీ చేసిన జిల్లా పాలనాధికారి - కలెక్టర్ శివలింగయ్య
ఈ వినాయక చవితికి ప్రజలంతా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని మహబూబాబాద్ జిల్లా పాలనాధికారి శివలింగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మట్టి వినాయకులను పంపిణీ చేసిన జిల్లా పాలనాధికారి