తెలంగాణ

telangana

ETV Bharat / state

'గీత మా అమ్మాయే.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్నాం' - పాకిస్తాన్ యువతి గీత అప్​డేట్స్​

తన కుటుంబాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న మూగ యువతి గీత తమ అమ్మాయేనని మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం నేరడ శివారు రాయినిపట్నానికి చెందిన కోల యాకయ్య, శాంత దంపతులు తెలిపారు. భారత్‌ నుంచి తప్పిపోయి పాకిస్థాన్‌ చేరిన గీతను నాటి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ వెనక్కు రప్పించిన విషయం తెలిసిందే. ఆమె స్వగ్రామాన్ని గుర్తించడం కోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంగళవారం బాసర తీసుకువచ్చారు.

latest updates on Pakistani young woman Gita
'గీత మా అమ్మాయే.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్నాం'

By

Published : Dec 17, 2020, 7:27 AM IST

Updated : Dec 17, 2020, 8:22 AM IST

బుధవారం రాత్రి ఓ వార్తా ఛానల్‌లో గీత గురించిన వార్త చూసిన వారు ఆమె 15 సంవత్సరాల కిందట తప్పిపోయిన తమ బిడ్డనేనంటూ విలపించారు మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం నేరడ శివారు రాయినిపట్నానికి చెందిన కోల యాకయ్య, శాంత దంపతులు. ‘2000 సంవత్సరంలో కుమార్తె జన్మించింది. సౌజన్యగా నామకరణం చేశాం. చిన్నప్పటి నుంచే మాట్లాడేదికాదు.సైగలే చేసేది. 2005లో ఉపాధి కోసం హైదరాబాద్‌ సుచిత్ర ప్రాంతంలో నివసించాం. కుమార్తెకు ఆరేళ్ల వయసున్నప్పుడు ఇంటి దగ్గరే వదిలి ఇద్దరం పనికి వెళ్లాం. తిరిగి వచ్చేసరికి కనిపించలేదు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో మరుసటి రోజే జీడిమెట్ల, కొంపల్లి పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశాం. తరువాత నెల రోజులు వెతికినా ఆచూకీ లభించలేదు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఏకైక కుమార్తె తప్పిపోవడంతో తట్టుకోలేకపోయామని, అప్పట్నుంచి కన్నబిడ్డ చిన్ననాటి దుస్తులను చూసుకుంటూ ఆ జ్ఞాపకాలతో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. సౌజన్య కుడి ముఖంపై కంటి పక్కన, కుడిభుజంపైనా పుట్టుమచ్చలున్నాయన్నారు. గీత వద్దకు తమను తీసుకెళితే గుర్తుపడతామన్నారు.

'గీత మా అమ్మాయే.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్నాం'
Last Updated : Dec 17, 2020, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details