తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యమకారులపై పోలీసుల దమనకాండ నశించాలి ' - Surya and Burka Pratap

వరంగల్ పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న న్యూడెమోక్రసీ నేతలు సూర్యం, బూర్క ప్రతాప్​లను వెంటనే కోర్టులో హాజరు పరచాలంటూ కార్యకర్తలు మహబూబాబాద్​లో ధర్నా నిర్వహించారు. ఉద్యమకారులపై పోలీసుల దమనకాండ నశించాలని తెలిపారు.

The activists held a Strike, demanding the immediate presence of Surya and Burka Pratap in Mahabubabad,
ఉద్యమకారులపై పోలీసుల దమనకాండ నశించాలి

By

Published : May 12, 2020, 4:06 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు న్యూడెమోక్రసీ కార్యకర్తలు ప్లకార్డులు చేతపట్టుకుని ధర్నా చేపట్టారు. అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న సూర్యం, బూర్క ప్రతాప్​లను వెంటనే కోర్టులో హాజరుపరచాలంటూ డిమాండ్​ చేశారు. ప్రజా ఉద్యమాలపై పోలీసుల దమనకాండ నశించాలి, ఆదివాసీ, పీసా చట్టాలను రక్షించాలంటూ నినాదాలు చేశారు. తెరాస ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఉద్యమకారులపై అక్రమ కేసులు పెడుతూ అణచివేస్తున్నారని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details