ప్రతి ఒక్కరి కృషితో ఈ అద్భుతమైన విజయాన్ని సాధించామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో కృతజ్ఞతా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రచారం చేయకున్నా ఇన్ని సీట్లను గెలుచుకున్నామన్నారు.
ప్రజలకు రుణపడి ఉంటాం: సత్యవతి రాఠోడ్ - మహబూబాబాద్ జిల్లా ఈరోజు వార్తలు
ప్రజలందరి ఆశీర్వాదంతో ఈ విజయాన్ని సాధించామని, తెరాసను గెలిపించిన ప్రజలందరికీ పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మంత్రి సత్యవతి రాఠోడ్. మహబూబాబాద్‌లో కృతజ్ఞతా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు : సత్యవతి రాఠోడ్
జెండా తప్ప ఎజెండా లేని ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా వినవద్దని ఎంపీ మాలోత్ కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ గెలుపును మంత్రి కేటీఆర్‌కు అంకితం ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఫరీద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్: గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు