తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మార్వో, వీఆర్వోలపై రైతుల ఆగ్రహం - ఎమ్మార్వో, వీఆర్వోలపై తాళ్ల ఊకల్‌ రైతుల ఆగ్రహం

ఎమ్మార్వో, వీఆర్వోలు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహబూబాబాద్‌ జిల్లాలోని తాళ్ల ఊకల్‌  రైతులు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆందోళనకు దిగారు.

ఎమ్మార్వో, వీఆర్వోలపై రైతుల ఆగ్రహం

By

Published : Nov 15, 2019, 10:53 AM IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకల్‌ గ్రామానికి చెందిన కొందరు రైతులు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళనకి దిగారు. ఎమ్మార్వో, వీఆర్వోలు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన రైతు వీరబోయిన ఐలయ్య సాదాబైనామా కింద పట్టాదారు పాసుపుస్తకానికి దరఖాస్తు చేసుకొని సంవత్సరమైంది. ఇప్పటికీ పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెప్పుడిస్తారంటూ గ్రామ వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యాలయంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అధికారులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా రైతులు వినకపోవడం వల్ల బలవంతంగా వారిని బయటకు పంపించారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని.. నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకం జారీ చేస్తామని తహసీల్దార్‌ సైదులు పేర్కొన్నారు.

ఎమ్మార్వో, వీఆర్వోలపై రైతుల ఆగ్రహం

ఇవీ చూడండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details