తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటో డ్రైవర్ వృత్తి ప్రజలకు సేవ చేసేది

ట్రాఫిక్ నియమ నిబంధనలను ఆటో డ్రైవర్లందరూ తప్పకుండా పాటించి ప్రమాదాలను తగ్గించాలని మహబూబాబాద్​ జిల్లా ఎస్పీ సూచించారు. ఆటో డ్రైవర్ వృత్తి ప్రజలకు చేవచేసే వృత్తని.. నిజాయతీగా పని చేయాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన సదస్సును పోలీసులు ఏర్పాటు చేశారు.

By

Published : Jul 30, 2019, 10:28 PM IST

ఆటో డ్రైవర్ వృత్తి ప్రజలకు సేవ చేసేది

ఆటో డ్రైవర్ వృత్తి ప్రజలకు సేవ చేసేది

ఆటో డ్రైవర్లు అంతా విధిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించి ప్రమాదాల నివారణ దిశగా కృషి చేయాలని పోలీసులు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్​లో పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆటో డ్రైవర్ వృత్తి ప్రజలకు సేవ చేసేదని, ఈ వృత్తిలో నిజాయతీగా ఉండాలని, ప్రతి ఒక్క డ్రైవర్ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని గమ్య స్థానాలకు చేర్చాలని ఎస్పీ తెలిపారు. జిల్లా ఏర్పాటు తర్వాత పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిందని అలాగే ట్రాఫిక్ నియమాలను అందరూ కచ్చితంగా పాటించాలని, రూల్స్ అధిగమించిన వారికి జరిమానా విధించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ మహేశ్, డీఎస్పీ నరేష్ కుమార్​తో పాటు పోలీస్ సిబ్బంది, జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 600 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details