తెలంగాణ

telangana

ETV Bharat / state

Cyber Crime Today in Mahabubabad: ఒక్క క్లిక్​తో.. రూ.2 లక్షలు ఖల్లాస్ - telangana news

Cyber Crime Today in Mahabubabad: క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం అప్పుజేసి ఆ నగదును బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేశాడు. ఆరోగ్యం సహకరించక.. బ్యాంక్​కు వెళ్లలేక.. చెక్​బుక్ కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నాడు. మరుసటి రోజు ఫోన్.. 'చెక్​బుక్ కోసం అప్లై చేసుకున్నారు కదా.. మీకో లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేయమని'.. అతను చెప్పినట్లుగా ఐదు సార్లు లింక్ క్లిక్ చేశాడు. అంతే.. ఖాతాలోని డబ్బంతా మాయం. ఏమైందని బ్యాంక్​ అధికారులను నిలదీస్తే అసలు సంగతి బయటపడింది.

Cyber Crime, Cyber Crime today, సైబర్ క్రైమ్
మహబూబాబాద్​లో సైబర్ క్రైమ్

By

Published : Dec 9, 2021, 12:08 PM IST

Cyber Crime Today in Mahabubabad: సైబర్ మోసగాళ్ల మాటల్లో పడి ఓ మాజీ సైనికుడు 2 లక్షల 30 వేల రూపాయలు పోగొట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని సిగ్నల్ కాలనికి చెందిన భిక్షపతి అనే మాజీ సైనికుడు ఇటీవలే క్యాన్సర్ బారిన పడ్డాడు. చికిత్స నిమిత్తం 2 లక్షల 30 వేల రూపాయలు అప్పుగా తీసుకొని ఎస్బీఐ , హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేశాడు. అవసరం అయినప్పుడు బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకుందాం అనుకున్నాడు. ఆరోగ్యం సహకరించక బ్యాంక్​కు వెళ్లలేకపోయాడు. ఆన్​లైన్​లో చెక్​బుక్​ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మరుసటి రోజు ఓ ఫోన్ కాల్ వచ్చింది.

ఒక్క క్లిక్​తో.. రూ.2 లక్షలు ఖల్లాస్

క్లిక్ చేశాడు.. బుక్కయ్యాడు..

'మీరు చెక్​బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కదా. ఓ లింక్ పంపిస్తున్నాం. దాన్ని క్లిక్ చేయండి' అని ఫోన్​ కాల్ సందేశం. వెంటనే భిక్షపతి ఆ లింక్​ను క్లిక్ చేశాడు. ఇలా 5 సార్లు లింక్ ఓపెన్​ చేయగా.. అతని ఖాతాలో ఉన్న నగదు అంతా మాయమైంది. కొద్దిసేపటి తర్వాత బ్యాంక్ నుంచి తన ఖాతా నుంచి మెసేజ్​ వచ్చింది. తన ఖాతాలో నగదు అంతా మాయమైనట్లు గ్రహించిన భిక్షపతి బ్యాంక్​కు ఫోన్ చేశాడు. సదరు బ్యాంక్ అధికారులు అతని ఖాతా నుంచి వేరే ఎవరో నగదు బదిలీ చేసుకున్నట్లు చెప్పారు. తాను మోసపోయానని అర్థమైన భిక్షపతి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బీ కేర్​ఫుల్

Mahabubabad Cyber Crime News : చికిత్స కోసం అప్పు చేసిన డబ్బంతా సైబర్ కేటుగాళ్లు దోచుకున్నారని తన డబ్బు తనకు ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలా సైబర్ కేటుగాళ్ల చేతిలో అమాయకులు ఎంతో మంది మోసపోతున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details