మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెంది తెరాస నేత తాళ్లూరి బాబు(68) గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు చివరగా వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వెళ్లారు. బాబు పార్థివ దేహానికి పూల మాల వేసి కంటతడి పెట్టారు. మృతుడి కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాబు గతంలో మహబూబాబాద్ మార్కెట్ కమిటీ, డోర్నకల్ సింగిల్ విండో ఛైర్మన్గా సేవలందించారు.
గుండెపోటుతో తెరాస నేత మృతి.. మంత్రి సత్యవతి కంటతడి - telangana tribal welfare minister sathyavathi rathode
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెంది తెరాస నేత తాళ్లూరి బాబు(68) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్.. బాబు పార్థివ దేహానికి పూల మాల వేసి కంటతడి పెట్టారు.
తెరాస నేత అంత్యక్రియల్లో మంత్రి సత్యవతి రాఠోడ్ కంటతడి
తాళ్లూరి బాబు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి రామచందర్ నాయక్, తెదేపా మహబూబాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి రామచందర్ రావు పరామర్శించారు.