తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర ప్యాకేజీతో గిరిజనులకు ప్రయోజనం లేదు' - మంత్రి సత్యవతి రాథోడ్ వార్తలు

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో గిరిజనులకు పెద్ద ప్రయోజనమేమి లేదని మంత్రి సత్యవతి రాఠోడ్‌ తెలిపారు. కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు ఫోన్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్‌ వివరించారు.

satyavathi rathod
satyavathi rathod

By

Published : May 18, 2020, 4:11 PM IST

కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ వల్ల గిరిజనులకు ప్రయోజనమేమి కలగడం లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. కరోనా వైరస్ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకు రవాణా వసతి పటిష్ఠం చేయాలని కోరారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్రంలోని గిరిజనుల పరిస్థితులు ఎలా ఉన్నాయని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్‌కు ఫోన్‌ చేసి ఆరా చేశారు.

కేంద్ర ఉద్దీపన ప్యాకేజీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ప్రయోజనమేమి లేదని సత్యవతి రాఠోడ్‌ స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని, లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు వివరించారు. గిరిజన ప్రాంతాల్లో కరోనా వైరస్ తాకిడి లేదని, అదే సమయంలో లాక్ డౌన్ సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ అమలు తీరుపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details