తెలంగాణ

telangana

ETV Bharat / state

'అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలి.. పదోన్నతులు కల్పించాలి'

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పీఆర్​టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఫిట్మెంట్ 45శాతం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పదోన్నతి, అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు.

Teachers held a dharna under the auspices of PRTU in Mahabubabad district center
పీర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా

By

Published : Feb 9, 2021, 6:30 PM IST

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని మహబూబాబాద్ జిల్లా పీఆర్​టీయూ అధ్యక్షుడు సంకా బద్రి నారాయణ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే 45శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు.

ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ జిల్లా కేంద్రంలో పీఆర్​టీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని 'వీ వాంట్ జస్టిస్, ప్రమోషన్స్‌' అంటూ నినాదాలు చేశారు. అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమం నుంచి తెరాసకు పీఆర్​టీయూ అనుకూలంగా పనిచేస్తోందని బద్రి నారాయణ అన్నారు. పక్క రాష్ట్రంలో సీఎం చిన్నవాడైనా ఐఆర్ 27 శాతం ఇచ్చాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 7.5శాతం ప్రకటించడం అన్యాయమని ఆరోపించారు. ఈ నెల 13న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:'సకల జనులను మోసం చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుంది'

ABOUT THE AUTHOR

...view details