తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎడ్ల బండిపై ఉపాధ్యాయుడి ఊరేగింపు - ఎడ్ల బండిపై ఉపాధ్యాయుడి ఊరేగింపు

సాధారణంగా పదవీ విరమణ కార్యక్రమం అంటే ఓ సమావేశం, శాలువాలు, బొకేలు నాలుగు ప్రసంగాలు. అంతే కదా...  మహబూబాబాద్​ జిల్లాలోని రేకుల తండాలో పదేళ్లపాటు ఉపాధ్యాయునిగా సేవలందించిన రామ నరేందర్​ను గ్రామస్థులు వినూత్న రీతిలో వీడ్కోలు పలికారు.

ఎడ్ల బండిపై ఉపాధ్యాయుడి ఊరేగింపు

By

Published : Sep 25, 2019, 2:03 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేసముద్రంలోని రేకుల తండాలో ఆయనో దేవుడు. గ్రామంలోని ఎంతో మంది విద్యాకుసుమాలను ఉన్నతంగా తీర్చిదిద్దాడు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పదేళ్లపాటు సేవలందించాడు. ఇప్పుడు పదవీ విరమణ పొందుతున్నాడు. ఉపాధ్యాయుడు రామ నరేందర్​కు తండా వాసులకు ఉన్న అనుబంధం ఎనలేనిది. తండాలో ఓ పదేళ్ల తరానికి విద్యా సేవలందించిన ఉపాధ్యాయుడికి ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. ఎడ్ల బండిపై ఘనంగా ఊరేగింపు చేశారు. ముందు పాటలు, విద్యార్థుల నృత్యాలతో గ్రామస్థులందరూ కలిసి పాల్గొన్న ఈ దృశ్యం మీ అందరి కోసం..

4547238

ABOUT THE AUTHOR

...view details