తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2019, 11:24 AM IST

ETV Bharat / state

స్పీడ్​ లేజర్​ గన్​లతో రోడ్డు ప్రమాదాల నివారణ

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మహబూబాబాద్​ జిల్లా పోలీసులు వాహనాల అతివేగాన్ని కొలిచే స్పీడ్​లేజర్​ గన్​లను వాడకంలోకి తెచ్చారు. తద్వారా 682 వాహనాలను గుర్తించి రూ. 7,05,870 జరిమానా విధించామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

taffice-police-use-speed-laser-guns-in-mahabubabad
స్పీడ్​ లేజర్​ గన్​లతో రోడ్డు ప్రమాదాల నివారణ

మహబూబాబాద్ జిల్లాలో రహదారులపై అతివేగంగా వెళ్లే వాహనాల వేగాన్ని కొలిచే అత్యాధునిక స్పీడ్ లేజర్ గన్​లను జిల్లా పోలీసులు వినియోగంలోకి తెచ్చారు. జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఆగస్టు 2019 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు 365 హైవే, తొర్రూర్ నుంచి దంతాలపల్లి హైవే వరకు స్పీడ్ కంట్రోల్ బోర్డులు ఉన్నా పరిమితికి మించి వాహనదారులు అతివేగంగా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో 682 వాహనాలు స్పీడ్ లేసర్ గన్​ల ద్వారా గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్క వాహనానికి రూ. 1,035 చొప్పున జరిమానా విధించారు. మొత్తం రూ. 7,05,870 జరిమానా విధించామని.. మూడు సార్లు చలాన పెండింగ్​ ఉన్న వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపినారు.

స్పీడ్​ లేజర్​ గన్​లతో రోడ్డు ప్రమాదాల నివారణ

ABOUT THE AUTHOR

...view details