మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా సూపర్ స్పైడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం (super spiders vaccination) కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మహబూబాబాద్ జిల్లాలో సూపర్ స్పైడర్లకు ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో 1,350 మందికి టీకా ఇవ్వనున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే(MLA) శంకర్ నాయక్‌లు సందర్శించారు.
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే జర్నలిస్టులు, గ్యాస్ సరఫరా చేసే వారు, పెట్రోల్ బంక్‌లో పనిచేసే వారు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫెర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ సిబ్బంది, చిరు వ్యాపారులకు వ్యాక్సిన్ ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.