మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే కొరమీసాల వీరభద్రుడి తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు.
నందివాహనంపై శ్రీ వీరభద్రస్వామి తెప్పోత్సవం - వీరభద్రస్వామి తెప్పోత్సవం
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల మధ్య పోతురాజుల విన్యాసాలు, మహిళల కోలాటాలతో శోభాయాత్రగా పుష్కరిణి వద్దకు చేరుకున్నారు.

నందివాహనంపై శ్రీ వీరభద్రస్వామి తెప్పోత్సవం
నందివాహనంపై శ్రీ వీరభద్రస్వామి తెప్పోత్సవం
ఆదివారం స్వామివారి ఉత్సవ విగ్రహాలను.. పోతురాజుల విన్యాసాలు, మహిళల కోలాటాలతో శోభాయాత్రగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నంది వాహనంపై వీరభద్రుడి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వీరభద్ర నామస్మరణతో పుష్కరిణి ప్రాంతం మార్మోగింది. వేడుకలు తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.