గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన - Spontaneous tours of Mahabubabad collector villages
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జిల్లా కలెక్టర్లు గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలకు మొగ్గుచూపుతున్నారు. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పాలనాధికారి వి.పి. గౌతమ్ నెల్లికుదురు మండలంలో పర్యటించారు.
గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల, ఆలేరు గ్రామాల్లో కలెక్టర్ వి.పి గౌతమ్ ఆకస్మికంగా పర్యటించారు. ద్విచక్ర వాహనంపై గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి పనులను పర్యవేక్షించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సరీలను, డంపింగ్ యార్డ్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.