మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. భక్తులు సంగీత వాయిద్యాలు, కోలాటాలతో నృత్యాలు చేశారు. గజ వాహనంపై పద్మావతి, అళివేలు మంగ, వేంకటేశ్వరస్వామిల ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షణలతో తిప్పుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
గజ వాహనంపై ఉత్సవ విగ్రహాలతో ప్రత్యేక దర్శనం
రథసప్తమి వేడుకలను మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా జరిపారు. ఈ సందపర్భంగా భక్తులు సంగీత వాయిద్యాలు, కోలాటాలతో నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గజ వాహనంపై ఉత్సవ విగ్రహాలతో ప్రత్యేక దర్శనం
రథసప్తమి సూర్యుని యొక్క జన్మతిధి అని, సూర్యుడు ఉత్తరయాణంలో ప్రవేశించి భక్తులకు దర్శనమిస్తారని ఆలయ పూజారి లక్ష్మీనరసింహ చార్యులు తెలిపారు. 7 రకాల ప్రసాదాలతో నైవేద్యాలను సమర్పించామని అన్నారు. రథసప్తమి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించి, తీర్థ ప్రసాదలను స్వీకరించారు.
ఇదీ చూడండి :మిత్రుడిలా వచ్చిన కొండముచ్చు... శత్రువులా దాడి చేసింది
TAGGED:
మహబూబాబాద్ జిల్లా వార్తలు