మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తొర్రూరులోని 16 వార్డుల్లో పది రోజుల పాటు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ప్రజా ప్రతినిధులు, అధికారులు అనేక సమావేశాల్లో ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోలేదు.
దోమలు, ఊర పందుల నిలయం.. తొర్రూరు జనం విలయం - torrur news
పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు గాలిలోనే కలిసిపోయాయి. ఒక్క మాట కూడా ఆచరణకు నోచుకోలేదంటే అధికారులు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో తెలిసిపోతుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో స్వాగతం చెప్తున్న సమస్యలను చూస్తుంటే... పట్టణ ప్రగతి ఎంతమేర జరిగిందో అర్థమవుతుందంటున్నారు ప్రజలు.
ఆచరణకు నోచుకోని హామీలు... స్వాగతాలు పలుకున్న సమస్యలు
చాలా వార్డుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. ఖాళీ ప్రదేశాల్లో మురికి నీరు నిలిచి పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దోమలు ఎక్కువై స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం కావటం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.