మహబూబాబాద్ జిల్లా మల్యాల శివారు దామ్య తండాలో పంచాయతీ కార్యదర్శి ద్విచక్ర వాహనంలో నాగుపాము దూరింది. ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నిలిపి ఉంచిన వాహనం లోపల పొడవాటి పాము దూరటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పాములు పట్టే వ్యక్తిని పిలిపించి బయటకు తీశారు. ఇంజిన్లో దూరిన పామును బయటకు తీసేందుకు కొంత కష్టపడ్డారు. అయితే బయటకు తీసిన సర్పంలో కోరలు, విషాపు గ్రంథులను పిల్లలకు చూపిస్తూ వివరించాడు.
బైకులో నాగుపాము..వర్షాకాలం జాగ్రత్త..! - స్కూటిలో ఎంత పెద్ద నాగుపామో...!
వర్షకాలం వచ్చిందంటే చాలు... ఎక్కడపడితే అక్కడ పాములు దర్శనమిస్తుంటాయి. పొలాల్లో, ఇంటి పెరట్లో కన్పించటం సాధరణమే కానీ ఓ నాగరాజు మాత్రం స్కూటీలో దూరి అందరినీ ఆందోళనకు గురిచేసింది.
snake-in-scooty-at mahaboobabad-mandal