తెలంగాణ

telangana

ETV Bharat / state

చంటిపిల్లలతో లెక్కింపు కేంద్రాల వద్ద తల్లుల తిప్పలు - \KLASRTHAVYAM

చిన్న చిన్న పిల్లలను ఎత్తుకొని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. ఇదేంటీ... అక్కడెందుకున్నారు అనుకుంటున్నారా...?

చంటిపిల్లలతో లెక్కింపు కేంద్రాల వద్ద తల్లుల తిప్పలు

By

Published : Jun 4, 2019, 12:13 PM IST

Updated : Jun 4, 2019, 12:47 PM IST

చంటిపిల్లలతో లెక్కింపు కేంద్రాల వద్ద తల్లుల తిప్పలు

ఎండలో చిన్న పిల్లలనెత్తుకొని పాలు పడుతూ... అక్కడే ఊయల కట్టి చంటి పిల్లలను లాలిస్తున్నారు కొంత మంది మహిళలు. అదేంటీ ఎండలో ఎందుకు చిన్నపిల్లలను ఉంచారు అనుకుంటున్నారా...! ఓ వైపు ఉద్యోగ కర్తవ్యం... మరోవైపు తల్లిప్రేమ. సంవత్సరం కూడా నిండని చిన్నారులను ఇంట్లో వదిలి రాలేక... కౌంటింగ్ కేంద్రాల వద్దకే తీసుకు వచ్చి లాలిస్తున్నారు ఆ తల్లులు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్​లో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ఫలితాల కోసం కొందరు, కౌంటింగ్​లో పాల్గొనేందుకు వచ్చిన మహిళా సిబ్బంది.... సరైన సౌకర్యాలు లేక ఇలా ఎండలో ఇబ్బందులు పడుతున్నారు.

Last Updated : Jun 4, 2019, 12:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details