తెలంగాణ

telangana

ETV Bharat / state

35 రకాల 4 వేల మొక్కలు నాటించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ తాజా వార్తలు

మహబూబాబాద్‌ జిల్లా నడివాడలో 35 రకాల 4 వేల మొక్కలను నాటారు. ఈ విధంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం వల్ల అడవులు 33 శాతానికి పెరుగుతాయని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తెలిపారు.

35 రకాల 4 వేల మొక్కలు నాటించిన ఎమ్మెల్యే
35 రకాల 4 వేల మొక్కలు నాటించిన ఎమ్మెల్యే

By

Published : Jul 3, 2020, 8:17 PM IST

మహబూబాబాద్ జిల్లా నడివాడలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గౌతమ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. ఒక ఎకరం స్థలంలో 35 రకాలకు చెందిన 4 వేల మొక్కలను జిల్లా అధికారులు.. గ్రామ ప్రజలతో కలిసి నాటారు.

ప్రతి గ్రామంలో ఈ విధంగా మొక్కలు నాటడం వల్ల అడవులు 33 శాతానికి పెరుగుతాయని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయన్నారు. కోతులు అడవిలోకి వెళ్లి వాటి బెడద తప్పుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు.

ఇదీ చూడండి:ప్రధాన కార్యదర్శితో సహా 100 మంది ఐఏఎస్​ల బదిలీ

ABOUT THE AUTHOR

...view details