మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మహబూబాబాద్ ఎంపీలు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు కేసముద్రంలో ఆర్యూబీ ఏర్పాటుకు అంగీకరించారు.
కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జ్‌కు స్థల పరిశీలన - Kesamudram Railway Underbridge
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై రైల్వే అధికారిణి శ్వేతా పన్వర్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సమగ్ర పరిశీలన అనంతరం మూడు ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని గుర్తించినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు.
![కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జ్‌కు స్థల పరిశీలన Site inspection of Kesamudram Railway Under bridge in mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8677191-955-8677191-1599215351798.jpg)
కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జ్‌కు స్థల పరిశీలన
కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై రైల్వే అధికారిణి శ్వేతా పన్వర్, తహసీల్దార్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సమగ్ర పరిశీలన చేసిన అనంతరం మూడు ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ పరిశీలన నివేదికను ఫైనల్ చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని శ్వేతా పన్వర్ వెల్లడించారు. ఈ సర్వేలో ఇంజినీర్లు, ఎంపీపీ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి:ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య!