తెలంగాణ

telangana

ETV Bharat / state

'డయల్​100 కు సమారమిస్తే పది నిమిషాల్లో మీ ముందుంటాం' - INTERNATIONAL WOMEN DAY 2020

మహబూబాబాద్​లో షీటీమ్స్​ ఆధ్వర్యంలో 2 కే రన్​ నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 600 మంది పాల్గొనగా... మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు.

SHE TEAMS CONDUCTED 2K RUN PROGRAM  IN MAHABOOBABAD
SHE TEAMS CONDUCTED 2K RUN PROGRAM IN MAHABOOBABAD

By

Published : Mar 7, 2020, 1:37 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్​లో షీటీమ్స్ ఆధ్వర్యంలో '2 కే రన్' నిర్వహించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ బిందు, మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి 3 స్థానాల్లో నిలిచిన మహిళలకు బహుమతులు అందించారు.

ఈ ఏడాదిని పోలీసు శాఖ 'ఇయర్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ'గా ప్రకటించిందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని... వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళలు షీటీమ్స్, డయల్ 100 కు సమాచారం అందిస్తే ... 10 నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుని సహాయం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దఎత్తున విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.

'డయల్​100 కు సమారమిస్తే పది నిమిషాల్లో మీ ముందుంటాం'

ఇవీ చూడండి:మద్యం దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు

ABOUT THE AUTHOR

...view details