మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి, జడ్పీటీసీ సుచిత్రలు పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. గిరిజనులకు తీజ్ అతి ముఖ్యమైన పండగని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేర్కొన్నారు. గిరిజన కన్నెపిల్లలు గోధుమ నారు పోసి, అవి మొలకెత్తిన తర్వాత తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గిరిజన దేవతలను పూజించి, చివరి రోజు బుట్టలను నిమజ్జనం చేస్తారని ఆయన వివరించారు.
తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ - తీజ్ వేడుకలు
మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి, జడ్పీటీసీ సుచిత్రలు వేడుకల్లో పాల్గొన్నారు.

తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్
తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్
ఇదీ చూడండి:ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?