మహబూబాబాద్ జిల్లా కురవిలోని ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులకు ముక్కిపోయిన బియ్యంతో వండిన భోజనం పెట్టారని నాయకులు ఆరోపించారు. ఆ భోజనం తిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.
ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో - kuravi news
మహబూబాబాద్ జిల్లా కురవిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. ముక్కిపోయిన బియ్యంతో వండిన భోజనం పెట్టిన ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
sfi leaders rastaroko on demand of suspend the principal
ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని... బాధ్యులైన అందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.