సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచాలంటూ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు నిరసన చేపట్టారు. ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టుతో డోర్నకల్ మండలంలోని రావిగూడెం, మన్నెగూడెం, అందనాలపాడుకు చెందిన సుమారు 200 మంది సన్న, చిన్నకారు గిరిజన రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీతారామ ప్రాజెక్టుతో ఉపయోగం లేకున్నా.. భూముల ఇస్తాం: నిర్వాసితులు - మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు భూ నిర్వాసితుల నిరసన
మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. ఎకరాకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుతో తమ ప్రాంతానికి ఉపయోగం లేనప్పటికీ... ప్రజా అవసరాల కోసం భూములు ఇస్తామని తెలిపారు.
![సీతారామ ప్రాజెక్టుతో ఉపయోగం లేకున్నా.. భూముల ఇస్తాం: నిర్వాసితులు seetharam project land aquisition victims protest at mahabubabad collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10375073-thumbnail-3x2-bhu.jpg)
సీతారామ ప్రాజెక్టుతో ఉపయోగం లేకున్నా.. భూముల ఇస్తాం: నిర్వాసితులు
సీతారామ ప్రాజెక్ట్‌తో తమ ప్రాంత రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తీసుకుపోయేందుకే ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రజా అవసరాల కోసం తమ భూములు ఇస్తామని, నష్ట పరిహారం మాత్రం రూ. 30 లక్షలు చెల్లించాలని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.10 లక్షల మాత్రమే ఇస్తామని చెబుతోందని ఆరోపించారు. భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేయాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ చెప్పినప్పటికీ... కలెక్టర్ పట్టించుకోవడం లేదన్నారు.